15-07-2025 10:33:17 PM
మహబూబాబాద్,(విజయ క్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై బిజెపి స్పష్టత నివ్వాలని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 9వ షెడ్యూల్ లో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చి పార్లమెంటులో బిల్లు ఆమోదింప చేయాలని బీసీ హక్కుల సాధన సమితి మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుగు కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం ముందు బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపి కలెక్టర్ కార్యాలయంలోని ఏవోకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల అంశంపై తలా ఒక మాట మాట్లాడుతూ బీసీల్లో అయోమయం కలిగిస్తున్నారని, 42 శాతం రిజర్వేషన్లను కేంద్రం అమలు చేసే విధంగా కృషి చేయాలని, లేనిపక్షంలో బీజేపీ ప్రజా ప్రతినిధుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీల సంఖ్యకు తగ్గట్టుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేశారు.