17-10-2025 12:31:01 AM
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు
గద్వాల టౌన్ అక్టోబర్ 16 : కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బిజెపి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. గురువారం గద్వాల పట్టణంలోని డికె. బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ బిసి బిల్లు అంటూ అన్ని పార్టీలతో నేను బిల్లును పాస్ చేశానని చెప్పుకుంటూ డెడికేషన్ కమిషన్ ను ప్రజల ముందు ఉంచ కుండా గవర్నర్ బీసీ బిల్లు ఆమోదముద్ర లభించకముందే,
రాష్ట్రపతి బీసీ బిల్లు ను పాస్ చేయకముందే బీసీలకు 67% రిజర్వేషన్లు అంటూ స్థానిక ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎన్ని కలకు రాష్ట్ర ప్రజలను సిద్ధం చేసి మళ్ళీ దింట్లో లోసగులను అడ్డం పెట్టి మీ రెడ్డి జాగృతి వ్యక్తుల ద్వారా హైకోర్ట్ లో పిటిషన్ వేయించారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రకౌన్సిల్ మెంబర్ బండల వేంకట రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శిలు రవి కుమార్ ఎక్బోటే, కేకే. రెడ్డి, శ్యాం రావ్,మండల అధ్యక్షుడు శ్రీనివాసులు,సీనియర్ నాయకులు పాపి రెడ్డి, శివ తదితరులు ఉన్నారు.