calender_icon.png 19 October, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి చేలల్లో బాల కార్మికులకు వెట్టి నుండి విముక్తి

17-10-2025 12:29:22 AM

బిజినపల్లి అక్టోబర్ 16 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల మంగనూరు గ్రామ శివారు పంట పొలాల్లో పత్తి తీస్తున్న 15 మంది బాల కార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు. పాఠశాల పని వేళల్లో పాఠశాలకి వెళ్ళకుండా కుటుంబ అవసరాల కోసం వారి తల్లిదండ్రులు పిల్లలను పత్తి చేలల్లోకి కూలీలుగా తరలించడంపై అధికారులు ఆకస్మిక దాడి నిర్వహించి 12 మంది బాలికలు, 03 బాలురు, మొత్తం 15 మంది బాల కార్మికుల విముక్తి కల్పించినట్లు జిల్లా ఏహెచ్ టియు సిఐ శంకర్ తెలిపారు.

వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన 10 మంది బాలికలు, బిజినేపల్లి మండలం మంగనూర్ గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు, మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం గట్టుపల్లి గ్రామానికి చెందిన ఒక అబ్బాయికి విముక్తి కల్పించారు. వాహనాల తనిఖీ చేసే క్రమంలో మరొ ఆరుగురు బాలికలను జిల్లా చైల్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరిచి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా చైల్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు లక్ష్మయ్య, నాగర్ కర్నూల్ జిల్లా యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్ సీఐ శంకర్, షిటీం ఎస్త్స్ర రజిత, ఏఎస్‌ఐ విజయలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య, పద్మ, కోనేరు ఎన్జీవో ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే. ఆంజనేయులు, చైల్ హెల్ప్ లైన్ యశ్వంత్, లలిత, షిటీం కానిస్టేబుల్ వెంకట్ నాయక్, మల్లేష్ తదితరులుపాల్గొన్నారు.