05-09-2025 01:49:24 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): పవిత్ర ఉమ్రా యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హుస్సేనీ (ముజీబ్)ని జిల్లా సంఘం ఘనంగా సన్మానిం చింది. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కుమార్, కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది.
జిల్లా కార్యవర్గ సభ్యులు, ఇతర నాయకులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా విక్రమ్‌కుమార్ మాట్లాడుతూ.. డాక్టర్ హుస్సేనీ పవిత్ర ఉమ్రా యాత్రలో ఉన్నప్పటికీ, సెప్టెంబర్ 1న నిర్వహించిన పెన్షన్ విద్రోహ దినోత్సవానికి విశేషంగా సహకరించారని కొనియాడారు.
డాక్టర్ ముజీబ్ మాట్లాడుతూ.. పవిత్ర కాబా ప్రార్థనా స్థలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వారి కార్యవర్గం, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అల్లాహ్ను ప్రార్థించినట్లు తెలిపారు.
జిల్లా కోశాధికారి జే బాలరాజ్, అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్ కుమార్, కార్యవర్గం ముఖీమ్ ఖురేషి, వైదిక్ శస్త్ర, శ్రీధర్, నాలుగవ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం మాజీ అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, ముస్తఫా, వహీద్, సోఫియాన్, రాహుల్ పాల్గొన్నారు.