calender_icon.png 16 December, 2025 | 10:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్తూరి నర్సయ్య మృతి బాధాకరం

16-12-2025 01:02:58 AM

కోదాడ, డిసెంబర్ 15(విజయ క్రాంతి): తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కస్తూరి నర్సయ్య మృతి చాలా బాధాకరమని ఉమ్మడి నల్గొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రాయపూడి వెంకట్ నారాయణ సోమవారం అన్నారు మలి దశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర  సాధన కోసం నిరంతరం తపించినవ్యక్తి కస్తూరి నర్సయ్య అని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కస్తూరి నర్సయ్య మరియు శ్రీకాకుళపు బ్రహ్మానందం తదితరులు ఒకేసారి నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ లో జాయిన్ కావడం జరిగిందని అప్పటినుంచి తామంతా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కలిసి ఉద్యమించామని ఆ రోజులు మరిచిపోలేని జ్ఞాపకాలు అని అన్నారు.