16-12-2025 01:01:42 AM
మెదక్/మనోహరాబాద్, డిసెంబర్ 15(విజయక్రాంతి): మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారం, రంగాయి పల్లి గ్రామాల మధ్యలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో సోమవారం భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇరు గ్రామాల ప్రజలు పరిశ్రమ ముందు ఆందోళన, ధర్నా చేపట్టారు.
పరిశ్రమలో ఇనుమును కరిగించే బట్టి పేలిపోవడంతో భారీ మంటలు చెలరేగగా అక్కడే పని చేస్తున్న అన్షు విశ్వకర్మ అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు కార్మికులు రాజేష్, పాండే లకు తీవ్ర గాయాలయ్యాయి. భారీ శబ్దం, దట్టమైన పొగ రావడంతో ఇరు గ్రామాల ప్రజలు పరిశ్రమ వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. గతంలో కూడా ఇలాంటి సంఘట నలు జరిగాయని, అయినా పరిశ్రమ యజమానులు నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తుల ఆరోపించారు.
ఈ పరిశ్రమ వల్ల గ్రామంలో భూగర్భ జలాలు కలుషితమై వాయు, శబ్ద కాలుష్యాల వల్ల ప్రజలు రోగాల బారిన పడుతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమను ఇక్కడి నుండి తొలగించాలని ధర్నా లు, ఆందోళనలు చేపట్టినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని మండిప డ్డారు. పరిశ్రమ యజమానులపై అటు ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, మృతి చెందిన, గాయాల పాలైన కార్మికుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలు సుకున్న స్థానిక ఎస్త్స్ర సుభాష్ గౌడ్‌తో పా టు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.