30-04-2025 10:51:46 PM
కోదాడ: మండల పరిధిలోని గుడిబండ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పులి వెంకటేశ్వర్లు మృతి బాధాకరం అని పార్టీ మండల అధ్యక్షుడు తూమాటి నాగిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుడి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఇర్లా నరోత్తమ్ రెడ్డి, కుక్కడపు నాగరాజు, పులి తిరుపతి బాబు ఉన్నారు.