01-05-2025 12:00:00 AM
డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి
గజ్వేల్, ఏప్రిల్ 30: బసవేశ్వరుడి సేవలు అనుసరణీయమని డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్ పట్టణంలో శ్రీ బసవేశ్వర జయంతి సందర్భంగా బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. మూఢనమ్మకాలను వ్యతిరేకించిన ఆయన లింగాయత్ ధర్మాన్ని ఆచరణ లో పెట్టినట్లు గుర్తు చేశారు.
బసవేశ్వరుడి తల్లిదండ్రులు ఆచారం సాంప్రదాయాలను ఇష్టపడగా, అందుకు భిన్నంగా ఆయన భక్తి మార్గాన్ని ఎంచుకొని శివుడే సర్వేశ్వరుడని భావిస్తూ శివతత్వాన్ని ఆచరించారన్నారు. వైదిక కర్మలను వ్యతిరేకించిన ఆయన సర్వ మానవ హితాన్ని బోధించే లింగాయత తత్వాన్ని విస్తృత%ళి% చేసినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, సుఖేందర్ రెడ్డి, వీరశైవ లింగాయత్ సమా జం బాధ్యులు డాక్టర్ కుమారస్వామి, బాల కుమార్, అమరవాది ప్రభాకర్, గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మొనగారి రాజు, రాములు గౌడ్, నేతలు కరుణాకర్ రెడ్డి, నర్సింహరెడ్డి, యాదగిరి, సమీర్, రమేష్ గౌడ్, గాడిపల్లి శ్రీనివాస్, సురేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
విశ్వగురువు మహాత్మా బసవేశ్వరుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, ఏప్రిల్ 30 : 12వ శతాబ్దంలో సమాజంలో కుల మత వర్ణ వ్యవస్థను రూపుమాపేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు.
బుధవారం విశ్వ గురు మహాత్మా బసవేశ్వరుడి 892 వ జయంతిని పురస్కరించుకొని వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో బీరంగూడ కమాన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మె ల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని బసవేశ్వరుడి కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సమాజం ప్రతినిధులు పాల్గొన్నారు.
బసవేశ్వరుడితోనే సమాజంలో మార్పు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్
మెదక్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుత్వ ఆదేశాలతో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథిగా పాల్గొని బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులకు శ్రీకారం చుట్టిన గొప్ప సంస్కర్త మహాత్మా బసవేశ్వరుడని పేర్కొన్నారు.
ఆయన బోధించిన అభ్యుదయవాద సంప్రదాయమే నేడు లింగాయత్ ధర్మంగా మారిందన్నారు. 12వ శతాబ్దంలోనే మహిళలకు సముచిన స్థానం కల్పించారని చెప్పారు.బసవేశ్వరుని సేవలను కొనియాడారు సమాజ స్థాపన కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి బసవేశ్వరుని మరి ఆయన చూపిన మార్గంలో మనమందరం నడవాలని కోరారు. మహాత్మ బసవేశ్వరుని జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లింగాయత్ సమాజం ప్రధాన కార్యదర్శి వీరేశం, గౌరవాధ్యక్షులు ఆనందం, కోశాధికారి ప్రభు, సలహాదారు సిద్దన్న, సంగమేశ్వర్, జంగమ సమాజం గౌరవ అధ్యక్షులు బసవలింగం కోశాధికారి పరమేశ్వర్ , పట్టణ అధ్యక్షులు భీమప్ప ,సలహాదారులు బసవరాజ్, మహలింగం, మహేష్ సతీష్ విజయ్ పాల్గొన్నారు.
మునిపల్లిలో..
మునిపల్లి, ఏప్రిల్ 30 : బసవేశ్వరుడి ఆలోచన విధానాలను ప్రతీ ఒక్కరు అలవర్చుకొని ముందుకు సాగాలని బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి , హైకోర్టు అడ్వకేట్ మంతూరి శశికుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో బసవేశ్వర కమిటీ అధ్యక్షులు సభ రాజు, మాజీ ఎంపీటీసీ ఉల్లిగడ్డల కుమార్, పట్లోళ్ల అంజన్న, మాజీ ఉపసర్పం లాడే రాములు, వార్డు మెంబర్ పడమటి కుమార్, గాండ్ల ప్రభు, పడమటి మాణిక్యం, పడమటి వీరేశం, పడమటి సంతోష్, పడిగిమ్మల బస్వరాజ్, మడుపతి అంజన్న స్వామి, మడుపతి వీరేశం స్వామి, నాయి కోటి సురేష్, పట్లోళ్ల పరమేశ్వర్ పాల్గొన్నారు.
నాగల్‌గిద్దలో ఘనంగా బసవ జయంతి
నాగల్ గిద్ద, ఏప్రిల్ 30: రాష్ర్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు నాగల్ గిద్ద మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బసవేశ్వర మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మండల ఎంపీడీవో మహేశ్వర రావు, ఇన్చార్జ్ తహసిల్దార్ శివకృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాణిక్ రావు పాటిల్, వీరసేవ లింగాయత్ సమాజ్ నాయకులు, పిఎసిఎస్ చైర్మన్ శ్రీకాంత్, రెవెన్యూ ఆఫీసర్ హన్మంతు రెడ్డి, నాగిశెట్టి, అంబ్రేష్ గడ్డే, సంజీవరావు పాటిల్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.