calender_icon.png 13 October, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యకర్తల అభిప్రాయం మేరకే అధిష్టాన నిర్ణయం: ఎమ్మెల్యే వేముల వీరేశం

13-10-2025 06:24:20 PM

నకిరేకల్ (విజయక్రాంతి): డీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక విషయంలో జిల్లాలోని ఆరు నియోజకవర్గాల కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే అధిష్టాన నిర్ణయం ప్రకటించడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని లక్ష్మీ సుజాత ఫంక్షన్ హాల్ లో డీసీసీ అధ్యక్ష ఎంపిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక విషయంలో నకిరేకల్ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం మేరకు మేము పనిచేస్తామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, సోనియా గాంధీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్ష పదవి కోసం ఎన్నిక ప్రకియ మొదలైందన్నారు. పార్టీలో ఏ ఎన్నిక జరిగిన పారదర్శకంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఏఐసీసీ మాజీ జనరల్ సెక్రటరీ బిస్వరాజన్ మహంతి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, నియోజకవర్గ ప్రజాపతినిదులు, నాయకులు పాల్గొన్నారు.