calender_icon.png 13 October, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యక్తిగత పరిశుభ్రతతో వ్యాధులు దూరం

13-10-2025 06:28:13 PM

ఎంఈఓ మేక నాగయ్య..

నకిరేకల్ (విజయక్రాంతి): వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్ల వ్యాధులు దరిచేరవని మండల విద్యాధికారి మేక నాగయ్య పేర్కొన్నారు. సోమవారం మండలంలోని తాటికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోషకాహారం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ భవాని మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించే ఆహారం ఎలా తయారు చేసుకోవాలో వివరించారు. చేతులు శుభ్రంగా కడుక్కునే విధానం గురించి అవగాహన కల్పించి పోషణ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పండుగ తిరుమలయ్య, అంగన్వాడి టీచర్లు నాగకుమారి, నాగమణి, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.