10 April, 2026 | 11:11 AM

వయనాడ్ విధ్వంసం స్వయంకృతం

15-08-2024 12:39 AM

వర్షాలకన్నా వాతావరణ మార్పుల ఫలితమే అధికం

వయనాడ్ (కేరళ), ఆగస్టు 14: భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళలోని వయనాడ్ తీవ్రమైన సంక్షోభాన్ని చవిచూసింది. దీనికి తోడు కొండచరియలు విరిగిపడటంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇలాంటి ప్రకృతి విధ్వంసానికి కారణం వర్షాలు 10 శాతం మాత్రమే కారణమని, మానవ ప్రేరిత వాతావరణ మార్పుల వల్లనే ఈ విపత్తు తీవ్రత పెరిగిందని తాజా అధ్యయనం వెల్లడించింది. మిగతా అంశాలన్నీ ప్రకృతిలో జరుగుతున్న కృత్రిమ మార్పుల వల్లనే సంభవించాయని పేర్కొంది. వయనాడ్ ప్రకృతి విలయంలో 200 మంది ప్రాణాలు కోల్పోయారు.

వయనాడ్ విధ్వంసానికి ప్రధాన కారణం మానవ ప్రేరేపిత కారణాలేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జూలై 29,30 తేదీల్లో భారీ వర్షపాతం నమోదైంది. కొన్నేళ్లలో పరిశీలిస్తే ఇది మూడో అత్యధిక వర్షపాతమని చెప్పవచ్చు. వయనాడ్ ప్రాంతంలో ౨ రోజుల వ్యవధిలో 57.2 సెం.మీ వర్షం కురిసిందని కేరళ సీఎం విజయన్ తెలిపారు. ప్రపంచ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియ స్ పెరిగితే కేరళలో ఒకేరోజు వర్షపాతం అదనంగా 4 శాతం పెరిగి కొండచరియలు విరిగి పడే అవకాశముందని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ గ్రూప్ హెచ్చరించింది. అయితే వాతావర ణ మార్పులతో పాటు అటవీ నిర్మూలన, అధి క అభివృద్ధి, అనుమతులు లేని పర్యాటకం వంటి అంశాలు కేరళలో విపత్తులకు కారణమవుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్య త్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు వాలు ప్రదేశాల్లో అటవీ సంపద పెంచడం వంటి చర్యలను సిఫార్సులు చేస్తున్నారు.