30-01-2026 12:00:00 AM
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 29, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు2026ను పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సి పల్ ఎన్నికలకు సంబంధించిన మీడియా సెల్ సమాచారం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు, ఎంసిఎంసి అంశా లు, ఇతర ఎన్నికల ఫిర్యాదులపై ప్రజలు కంట్రోల్ రూమ్ నంబర్ 9381082501ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
ఈ కంట్రోల్ రూమ్లో 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉండి, అందిన ప్రతి ఫిర్యాదును రిజిస్టర్లో నమోదు చేసి, సంబంధిత అధికారుల ద్వారా తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, నిబంధనల మేరకు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.