calender_icon.png 17 December, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్‌లో ఘనంగా విజయ్ దివస్

17-12-2025 01:32:29 AM

  1. అమరవీరుల స్తూపం వద్ద గవర్నర్, డిప్యూటీ సీఎం నివాళులు 
  2. పాక్‌పై భారత సైన్యం సాధించిన అపురూప విజయానికి నేటితో 54 ఏళ్లు
  3. త్రివిధ దళాల అధికారుల గౌరవ వందనం  
  4. దేశ ఔన్నత్యాన్ని కాపాడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ: భట్టి విక్రమార్క

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): భారత సైనిక శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పిన 1971 ఇం డో-పాక్ యుద్ధ విజయానికి ప్రతీకగా.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో విజయ్ దివస్ వే డుకలు ఘనంగా జరిగాయి. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘనంగా నివాళులర్పించారు. పరేడ్ గ్రౌం డ్లోని అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు.

కార్యక్ర మంలో భాగంగా త్రివిధ దళాల ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు, జవాన్లు అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు. సైనిక బ్యాండ్ వాయిద్యాల నడుమ, నిశ్శబ్ద వాతావరణంలో వీరులకు నివాళి అర్పించారు. గవర్నర్, డిప్యూటీ సీఎంలు మాజీ సైనిక అధికారులతో ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ 1971 యుద్ధ విశేషాలను గుర్తుచేసుకున్నారు.

దేశ ఔన్నత్యాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడటంలో నాటి ప్రధాని, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. పాకిస్థాన్ దుశ్చర్యలను తిప్పికొట్టడంలో ఆమె తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, భారత సైన్యం చూపిన తెగువ వల్లనే బంగ్లాదేశ్ ఆవిర్భవించిందన్నారు.కేవలం 13 రోజుల్లోనే పాక్ సైన్యాన్ని మోకరిల్లేలా చేసిన ఘనత మన సైనికులది అని కొనియాడారు.

వారి త్యాగాలను స్మరించుకోవడమే మనం వారికిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 1971 యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్న మాజీ సైనిక అధికారులు, ఉద్యోగులు పాల్గొనడం విశేషం. కార్యక్రమంలో ఆర్మీ ఉన్నతా ధికారులు, ఎన్సీసీ క్యాడెట్లు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జై హింద్ నినాదాలతో పరేడ్ గ్రౌండ్ మార్మోగింది.