calender_icon.png 7 July, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెరవేరనున్న చెంచుల సొంతింటి కల

07-07-2025 01:23:08 AM

- నేడు మున్ననూరులో చెంచులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు 

- రాష్ట్రవ్యాప్తంగా చెంచులకు మొత్తం 13 వేల ఇందిరమ్మ ఇండ్లు

- గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 9 వేలు మంజూరు 

- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి 

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): దశాబ్దాలుగా సమాజంలో అత్యంత వెనకబడి,  సొంత ఇండ్లను నోచుకోని చెంచులకు రాష్ట్ర ప్రభుత్వం సొంతింటి కలను నెరవేరస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

రాష్ర్టంలోని ఉట్నూ రు, భద్రాచలం, మున్ననూర్,  ఏటూరు నాగారంలో ఉన్న నాలుగు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలోని 21 నియోజకవర్గాలలో సాచ్యురేషన్ పద్దతిలో 13,266  చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇం డ్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి  ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

గిరిజన ప్రాంతాల్లో శాశ్వ త గృహాలను నిర్మించాలని రాష్ర్ట గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ పలు సందర్భాలలో ప్రభుత్వానికి సూచనలు చేశారని, సీఎం రేవంత్‌రెడ్డి కూడా అనేక సందర్భాలలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ముఖ్యంగా వారి నివాస గృహాల నిర్మా ణంపై అనేక సూచనలు చేశారని మంత్రి తెలిపారు. గవర్నర్, సీఎం సూచనలు సలహాల మేర కు గిరిజన ప్రాంతాల్లో చెంచులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నా మని తెలిపారు.

మొదటివిడతలో భాగంగా సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజ కవర్గంలోని మున్ననూర్‌లో చెంచులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను స్వయంగా తానే  అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

అడవులను నమ్ముకొని జీవించే గిరిజ నులలో చెంచులు ఒక జాతి అని, వీరు అడవుల్లో వేటాడటం, అటవీ ఫలసాయం సేకరించి అమ్ముకొని జీవనం సాగిస్తున్నారని, చిన్నచిన్న గుడిసెలు తప్ప వీరికి పక్కా ఇల్లు ఎలా ఉంటుందో ఊహకు అందని విషయమన్నారు.  అందుకే వీరు జీవించే ప్రదేశంలోనే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం వారి గురించి ఆలోచన చేయలేదన్నారు. 

చెంచులకు13,266 ఇండ్లు మంజూరు

ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోని మంచిర్యాల నిర్మల్ ఆసిఫాబాద్ బోధ్బ్ ఖానాపూర్ సిర్పూర్ 227, అదిలాబాద్ బెల్లంపల్లి ఇండ్లు మంజూరు చేశామన్నారు. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో అశ్వరావుపేట మున్ననూర్ చెంచు స్పెషల్ ప్రాజెక్ట్‌లో 2 అచ్చంపేట్ 785, మహబూబ్‌నగర్ 245, పరిగి తాండూర్ కొల్లాపూర్17105, కల్వకుర్తి10120, వికారాబాద్ దేవరకద్ర 64, నాగార్జునసాగర్ ఇలా మొత్తంగా 13,266 ఇండ్లను చెంచులకు మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

ఈ ఏడాది రాష్ర్టం లో  ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లును మంజూరు చేస్తున్నామని, అయితే ఐటీడీఏ పరిధిలోని  గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుంచి 700 ఇండ్ల చొప్పున మొత్తం 8,750 ఇండ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిర్మాణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌ను  నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు.