07-07-2025 01:23:40 AM
మహబూబ్ నగర్ జూలై 6 (విజయ క్రాంతి) : తాటి చెట్టు ఒక కలప వృక్షమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మం డలం కొర్రెముల గ్రామంలో తాటి చెట్లను తొలగించిన సమాచారం తెలిసిన వెంటనే మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ సంఘటన స్థలాన్ని సందర్శించారు.
అనేక వ్యాధులు తక్కువయ్యే ఔషద గుణాలు ఈ కల్లు, నీరాలో ఉన్నాయని తెలిపారు. సుమారు 100 సంవత్సరాలు గల 80 తాటి చెట్లను, కల్లు గీస్తున్న చెట్లను కూడా తొలగించడం జరిగిందని కొట్టడానికి అనుమతి ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.