12 May, 2026 | 7:42 AM

పేదల సొంతింటి కల నెరవేరుతుంది...

30-06-2025 08:14 PM

మునుగోడు (విజయక్రాంతి): ప్రతి పేదోడి సొంతింటి కల నెరవేరుతుందని చండూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోటి నారాయణ(Agricultural Market Chairman Dhoti Narayana) తెలిపారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) ఆదేశాల మేరకు మండలంలోని జక్కల వారి గూడెంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులుతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఇల్లు లేని ప్రతి పేదవాడికి విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్ల కట్టించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం అని గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మండలానికి ఒక్క డబుల్ బెడ్ రూం మంజూరు చెయ్యలేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిన ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల ప్రభుత్వం అమలు చేస్తుందని, దానిలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు అయ్యిందని అన్నారు.

ముందుగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేసి ఆ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి ఇప్పుడు ప్రతి గ్రామంలో అర్హులైన వారికి ఇండ్ల మంజూరు ప్రభుత్వం చేస్తుందని అన్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే నిర్మాణాలు మొదలు అయ్యాయని నిర్మాణం మొదలు పెట్టని వారు త్వరగా ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టాలని ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ప్రభుత్వమే ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కలి శ్రీను, ఎంపీడీవో విజయభాస్కర్, హౌసింగ్ ఏఈ అనిల్, గ్రామ శాఖ అధ్యక్షులు జక్కల మహేష్, కుంభం చెన్నారెడ్డి, ఆరేళ్ల సైదులు మాజీ ఉపసర్పంచ్ జక్కల నరసింహ, మల్లయ్య, అంజయ్య ,యాదయ్య ,గ్రామ ప్రజలు ఉన్నారు.