calender_icon.png 17 December, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలుపు కోసం కార్యకర్తల కృషి మరువలేనిది

17-12-2025 12:00:00 AM

ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి ఎమ్మెల్యే విజయుడు 

అలంపూర్, డిసెంబర్ 16: సర్పంచి ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుకు కార్యకర్తలు చేసిన కృషి మరువలేనిదని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మంగళవారం కర్నూలు పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు ఎమ్మెల్సీ, చల్లా వెంకట రామిరెడ్డి , ఎమ్మెల్యే విజయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నూతన సర్పంచులను శాలువా కప్పి పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపా రు. అనంతరం ఇరువురు మాట్లాడు తూ... ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని గుండెల్లో పెట్టుకున్నారని ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ మద్దతు దారులకు ఓటు వేసి పార్టీ పట్ల కెసిఆర్ పట్ల ఉన్న ప్రేమ అభిమానాన్ని నిరూపించుకున్నారన్నారు.  గ్రామాల్లో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో  ఉత్తనూర్ సర్పంచ్ రాణమ్మ, వెంకటాపురం సర్పంచ్ శకుంతల, బింగి దొడ్డి సర్పంచ్ వెంకటేష్, కిష్టాపురం సర్పంచ్ జయమ్మ, యాపదిన్నె సర్పంచ్ జయశ్రీ, కేశవరం సర్పంచ్ జయరాజ్, ఎక్లాస్ పురం  సర్పంచ్ కురువ నాగన్న, తూముకుంట సర్పంచ్ కృష్ణ వర్ధన్ రెడ్డి, కొత్తపల్లి సర్పంచ్ సురేష్ టిటి దొడ్డి సర్పంచు ఎద్దుల రాముడు, పలు వార్డు సభ్యులు ఉన్నారు.