20-09-2025 07:17:45 PM
గుప్పెడు బియ్యం ద్వారా సేకరించిన 30 క్వింటాళ్ల బియ్యం పంపిణీ..
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్..
కామారెడ్డి (విజయక్రాంతి): వరద బాధితులకు మహిళా సమాఖ్య సంఘాల ఆధ్వర్యంలో గుప్పెడు బియ్యం కింద సేకరించిన 22 క్వింటాళ్ల బియ్యాన్ని వరద బాధిత కుటుంబాలకు అందజేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్(District Collector Ashish Sangwan) అన్నారు. శనివారం కలెక్టరేట్లో బాధిత మహిళలకు గుప్పెడు బియ్యం ద్వారా సేకరించిన 22 క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఆపదలో మేము ఉన్నామని గొప్ప భరోసాను బాధితులకు కల్పించి ముందుకు వచ్చి సాయం చేసిన మహిళా సంఘాలు ఆదర్శినియంగా నిలిచాయని అన్నారు.
ప్రభుత్వం అందజేస్తున్న సహకారంతో పాటు దాతలు ఇచ్చే సహకారం వరద బాధితులకు ఎంతో ఆత్మ స్థాయిరాన్ని కలిగిస్తాయని మహిళా సంఘాలను పూర్తిగా తీసుకొని ఇతర సంఘాలు, ఎవరైనా వరద బాధితులకు సాయం అందించేందుకు ముందుకు రావాలని కలెక్టర్ అన్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం నడిమి తండా ఎల్లప్పుడు తండా లోని పదిమంది బాధితులకు బియ్యం బ్యాగులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ నాయక్, డి ఆర్ డి ఓ సురేందర్, అదనపు డిఆర్డిఓ విజయలక్ష్మి, ఏ పి ఎం రాజారెడ్డి,సీసీలు (CCs), మండల సమైక్య రాజంపేట అధ్యక్షురాలు లక్ష్మి, కార్యదర్శి లత, కోశాధికారి లావణ్య, నడిమి తండా, ఎల్లాపూర్ తండాల లబ్ధిదారులు పాల్గొన్నారు.