20-09-2025 07:21:50 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): మహనీయుల జీవిత చరిత్ర నేటి తరానికి ఆదర్శం అని,వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయాలను సాధించాలని లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర ఇంచార్జి బానోత్ నరేష్ నాయక్ అన్నారు.మండలంలోని వట్టిమల్ల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకి శనివారం ఆయన స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలను పాఠశాలకు బహుకరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... మనం ఈరోజు ఇంత స్వేచ్చగా జీవిస్తున్నామంటే దానికి కారణం ఆ మహనీయుల ప్రాణ త్యాగాలే అని అన్నారు.అలాంటి స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చడానికి బీజం విద్యార్థులే అని, నేటి బాలలే రేపటి సమాజాన్ని కాపాడే పౌరులుగా కావాలని అన్నారు.విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి ప్రవర్తన, నైపుణ్యం అలవర్చుకోవాలని అన్నారు.