30-08-2025 12:23:22 AM
కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి
ఖైరతాబాద్, ఆగస్టు 29 (విజయ క్రాంతి) : విధి నిర్వహణలో సేవాతత్పురత కు విద్యుత్ శాఖా పెట్టింది పేరు అని కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ అభివర్ణించారు. గడిచిన రెండు సంవత్సరాలుగా భారీ నుండి అతి భారీ వర్షాలతో ఎన్ని ఉపద్రవాలు సంభవించినా విద్యుత్ ప్రసారంలో ఎటువంటి అంతరాయం కలుగ కుండా ఉండడమే ఇందుకు నిదర్శనమని ఆమె అన్నారు.
శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోట్రాన్స్కో ఏ.డి.ఇ కిరణ్ కుమార్ అధ్యక్షత తెలంగాణా ట్రాన్స్కో కమర్షియల్ సి.ఇ హేమ పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పదవి విరమణ పొందిన కే. హేమతో పాటు శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీని ట్రాన్స్కో ఉద్యోగు లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జీ.సంపత్ కుమార్, ప్రాజెక్ట్ డైరెక్టర్ లతా వినోద్ కుమార్,కమర్షియల్, ఫైనాన్స్,ఎన్.హెచ్.ఆర్.డి డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.