30-08-2025 12:25:01 AM
వెల్దుర్తి, ఆగస్టు 29 :వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన కొనింటి క్రిష్ణ 13 సం వత్సరాల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి కొ న్ని ఇబ్బందుల్లో చిక్కుకొని కుటుంబ సభ్యులతో సంబంధాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా డు.
ఈ సమయంలో దుబాయ్ లో ఉంటున్న కామారెడ్డి వాస్తవ్యులు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీ త లక్ష్మారెడ్డి సమీప బంధువు హన్మంత్ రెడ్డి లక్షల రూపాయలు ఖర్చు చేసి దుబాయిలో ఉన్న కృష్ణకు తగిన సదుపాయాలు కల్పించి గత కొద్ది రోజులుగా తన వద్ద నివాసం ఏర్పరిచి తిరిగి ఆ వ్యక్తిని తన సొంత గ్రామానికి క్షేమంగా పంపించాడు. ఈ విషయం తెలుసుకున్న వెల్దుర్తి మం డల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు వంచ భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి, అలాగే దుబాయిలో సహాయ సహకారాలు అందించిన హనుమంత్ రెడ్డికి గ్రామం తరపున కృతజ్ఞతలు తెలి పారు. వారు చేసిన సహాయం మర్చిపోలేదని వారిని కొనియాడారు.