09-01-2026 12:39:32 AM
ఆలేరు, జనవరి 8 (విజయక్రాంతి): ఉపాధి హామీ పథకాన్ని యదావిధిగా కొనసాగించాలి, బీ జే పీ మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చడమే కాదు, రాబోయే కాలంలో ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తారు అని సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్, అఖిల భారత రైతు.కూలీ సంఘం (ఏ ఐ కె ఎం ఎస్) జిల్లా అధ్యక్షుడు కల్లెపు అడివయ్యలు అన్నారు,
ఉపాధి హామీ కూలీలకు సంవత్సరంలో 2 వందలు రోజులు, రోజుకు ఎలాంటి షరతులు లేకుండా 600/- ఇవ్వాలని ఏ ఐ కె ఎం ఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు ఆలేరు, మోటకొండూరు, యాదగిరిగుట్ట, రాజాపేట మండలాలలోని టంగుటూరు, శారాజీపేట, కొల్లూరు, చిన్న గౌరాయపల్లి, కాచారం తదితర గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను, స్థానిక ప్రజలను ప్రత్యక్షంగా కలిసి ఉపాధి హామీ పథకం పేరును మార్చడంతో పాటు, కొత్త పథకంలో ఉన్న కూలీలకు వ్యతిరేకమైన అనేక విషయాలను చెప్పడం,
కరపత్రాలను విస్తృతంగా పంపిణీ చేసి ప్రచారం చేయడం జరిగింది. కరపత్రంను టంగుటూరు గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్ కి మరియు వార్డు సభ్యులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు పంజాల మురళి, కొంగరి సాయిరాం, ఇంజ శ్రీనివాస్, ఏ ఐ కె ఎం ఎస్ డివిజన్ నాయకులు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.