09-01-2026 12:41:02 AM
పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఇందుర్తి వెంకట్ రెడ్డి
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జనవరి 8: క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఇందుర్తి వెంకట్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ ఆవరణలో గల్లీ క్రికెట్ యూత్ ఆధ్వర్యంలో గురువారం జిల్లాస్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వం కలుగుతుందని, యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా క్రీడల ద్వారా మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలన్నారు.
రాష్ట్రంలో క్రీడారంగాన్ని ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు జీడి వీరస్వామి, పాలెల్లి సురేష్, ఎంఎన్‌ఓ కుంభం ప్రభాకర్, మాజీ ఎంపీపీ రత్నం మల్లేశం, కాంగ్రెస్ నాయకులు గుడిపెల్లి వెంకట్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కొణతం వెంకటరెడ్డి, నల్లగుంట్ల నాగేందర్, జీడి భాస్కర్, ఎడ్ల సతీష్, బొడ్డు శ్రీను, ఎల్లెంల అవిలయ్య, జితేందర్ రెడ్డి, జానయ్య, గల్లి క్రికెట్ యూత్ అధ్యక్ష, కార్యదర్శులు బొల్లం ఉమేష్, గరిగంటి కృపాకర్, ఎల్లెంల ఉమేష్, నరేష్, కోటేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.