అన్నదాత భగీరథ యత్నం
వరి నారుకు జీవం కోసం.. వాగుల్లో ఊట బావులు
మహబూబాబాద్, విజయక్రాంతి: ఈ చిత్రం వాగులో ఇసుక తోడుకెళ్లేందుకు జరుగుతున్న ప్రయత్నమని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం ముంగిమడుగు గ్రామ శివారులో ఆకేరు వాగు పూర్తిగా ఎండిపోవడంతో.. వాగు పరివాహక ప్రాంతంలో రైతు లూనావత్ వీరన్న ఎకరం వరి సాగు కోసం పోసిన నారు ఎండిపోతుండడంతో వాగులో ప్రత్యేకంగా గంటకు 2,500 రూపాయలు వెచ్చించి ప్రోక్లైనర్‌తో ఊట బావి తీయిస్తున్న దృశ్యం ఇది. జూలై నెలాఖరులో వరుణ దేవుడి కరుణ లేక ఆకేరు వాగు పూర్తిగా అడుగంటి పోవడంతో వాగు పరివాహక రైతులంతా ఇదే తరహాలో వరి నా రు మళ్లను కాపాడుకోవడానికి వాగులో ఊట బావులు తీయిస్తూ ‘భగీరథ’ ప్రయత్నాలు చేపట్టారు. ఊట బావిలో ఊరిన నీటితో వరి నారుకు జీవం పోయిస్తున్నారు.






