calender_icon.png 17 September, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బకాయిలన్నీ ఇచ్చేదాకా పోరు ఆగదు

17-09-2025 02:21:43 AM

  1. దశల వారీగా ఉద్యమాలు చేపడతాం
  2. రాజ్యసభ్య సభ్యుడు ఆర్.కృష్ణయ్య
  3. ఫీజుల పథకంపై సంస్కరణలు తేవడంపై హర్షం వ్యక్తం చేసిన ఎంపీ

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 16(విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నీ ప్రభుత్వం చెల్లించే వరకు వివిధ విద్యా, బీసీ సంఘాలతో కలిసి ఉద్యమాన్ని దశల వారీగా ఉద్ధృతం చేస్తామని రాజ్యసభ్య సభ్యుడు ఆర్ కృష్ణయ్య మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రభుత్వం కేవలం రూ.600 కోట్లు మాత్రమే విడుదల చేస్తామని ప్రకటించడం సమస్యను మరింత జఠిలం చేయడమేనని ఆయన విమర్శించారు.

మొత్తం బకాయిలు చెల్లించే వరకు విద్యార్థి, బీసీ సంఘాల ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం రాష్ట్రవ్యాప్తంగా యాజమాన్యాలు ఇచ్చిన కాలేజీల బంద్ పిలుపును విరమించుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా నివారించినట్ల యిందన్నారు. మొత్తం బకాయిలు రూ.ఎనిమిది వేల కోట్లు ఉండగా, రూ.600 కోట్లు ఏ మూలకు సరిపోతాయి అనిఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే ప్రభుత్వం మొత్తం బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని కృష్ణయ్య సీఎం రేవంత్‌రెడ్డికి  రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఫీజుల పథకంపై ప్రభుత్వం కొన్ని సంస్కరణలు తీసు కురావాలని యోచిస్తున్నట్లు సీఎం ప్రకటించడాన్ని స్వాగతిస్తు న్నామన్నారు. అయితే ఆ సంస్కరణలు విద్యార్థులకు ఉపయోగపడేలా ఉండాలని కృష్ణయ్య సూచించారు.

‘ఫీజులను నేరుగా విద్యార్థుల ఖాతాల్లో వేస్తామనడం చూడటానికి బాగానే ఉన్నా, ఆచ రణలో ఇది పేద విద్యార్థులకు శాపంగా మారే ప్రమాదం ఉందన్నారు. అడ్మిషన్ల సమయంలోనే ఫీజులు చెల్లించాలని యాజమాన్యాలు ఒత్తిడి చేస్తే, ఆర్థిక స్థోమత లేని విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతారని, దీనివల్ల పథకం లక్ష్యమే దెబ్బతిం టుంది,‘ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశా రు.

అందువల్ల, ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోయినా అడ్మిషన్లు ఇచ్చేలా కాలేజీ యా జమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని, లేదా విద్యార్థి- తల్లిదండ్రుల జాయింట్ అకౌంట్ బదులుగా విద్యార్థి-, ప్రిన్సిపాల్ జాయింట్ అకౌంట్ విధానాన్ని తీసుకురావాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.