17-09-2025 02:19:26 AM
మెట్‌పల్లి, సెప్టెంబర్ 16(విజయ క్రాంతి): గత ప్రభుత్వం నిలువ నీడ లేని పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యం తో ప్రా రంభం చేసిన డబుల్ బెడ్ రూమ్ పథకం నిర్వీర్యం అవుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం తో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు అడవిలో వనవాసం చేస్తున్నా రు. సరైన రహదారులు లేక తాగడానికి మం చినీరు లభించక, డ్రైనేజి వ్యవస్థ సరిగా లేక ప్రతి రోజు తీవ్ర దుర్గంధం మధ్య జీవితాలు వెళ్లదిస్తున్నారు. ఇది మెట్ పల్లి మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల వ్యధ భరిత కథనం.....
గత ప్రభుత్వ హయాంలో 2022 జూన్ పదిన మెట్ పల్లి పట్టణానికి ఐదు కిలోమీట ర్ల దూరంలోని అర్బన్ హౌసింగ్ కాలనిలో పది బ్లాక్ లతో నూట పది డబుల్ బెడ్ రూ మ్ ఇళ్లు నిర్మాణం చేయడం జరిగింది. లబ్ధిదారులు ఎంపిక అనంతరం అప్పటి మంత్రి కెటిఆర్ ఆధ్వర్యంలో ప్రారంభం చేశారు.డ బుల్ బెడ్ రూమ్ లు ఘనంగా ప్రారంభం చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు మౌళి క వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించడం లబ్ధిదారులకు శాపంగా మారింది.
అర్బన్ కాలనీ చుట్టు పెరిగిన చెట్లతో అడవిని తలపిస్తోంది. పెరిగిన పిచ్చి మొక్కలతో ప్రతి రోజు విష సర్పాలు ఇళ్లలోకి రావడం రివాజ్ గా మారింది. దింతో కాలనీ వసూలు భయం భయంగా కాలం వెళ్లదిస్తున్నారు.కాలనిలో మిషన్ భగీరథ నీటి సరఫరా లేని రోజు తా గు నీటి కోసం కిలోమీటర్ వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. మురుగు నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేక పోవడంతో ఇళ్ల పక్కన మురుగు నీరునిలువ ఉంటుంది. దింతో తీవ్ర దుర్గం ధం నెలకొని కాలనీ వాసులు అనారోగ్యల బారిన పడి ఆసుపత్రుల చుట్టు తిరుగుతున్నారు.
యాభై శాతం లబ్ధిదారులకు మెట్ పల్లి పట్టణంలో స్వంత ఇళ్లు ఉండడం తో వారు తమ గదులకు తాళాలు వేసి వెళ్లారు. దింతో ఆ గదులు నిరూపయోగంగా ఉంటున్నా యి. మరి కొందరు తమ గదులను అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. నిజమైన ఇళ్లు లేని నిరుపేదలకు డబులు బెడ్ రూమ్ లు అంది ఉంటే ఈ పరిస్థితి నెలకొనేది కా దని కాలనీ వసూలు పేర్కొంటున్నారు.డబుల్ బెడ్ రూమ్ గదుల ప్రారంభం సమ యంలో లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన రహదారిని కొందరు కబ్జా చేసినట్లు కాలనీ వసూ లు పేర్కొంటున్నారు.
కాలానికి రహదారి సౌకర్యం కల్పించాలి
డబుల్ బెడ్ రూమ్, రహదారులను అప్పటి మంత్రి కెటిఆర్ ప్రారంభం చేశారు. కాని ఆ రహదారిని కొందరు కబ్జా చేసి కందకం తవ్వారు. దింతో స్కూల్ బస్‌లు కాలానికి రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.అధికారులు వెంటనే రహదారి సౌకర్యంకల్పించాలి.
సోరుపాక రవి, కాలనీ వాసి
తాగు నీటి కోసం బోరు వేయండి
మిషన్ భగీరథ నీరు రాని రోజు తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎ దుర్కొంటున్నాం. కాలనీ లో ఒక బోర్ ఏర్పాటు చేయాలి. అలాగే మురుగు నీ రు బయటకు వెళ్లక పోవడం తో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది.సమస్య ల పరిష్కారం కోసం అధికారులు చర్యలు చేపట్టాలి.
అడ్యాల చంద్ర కాంత్ కాలనీ వాసి