calender_icon.png 17 September, 2025 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీనగర్ కాలనీలో సిల్క్ ఎగ్జిబిషన్

17-09-2025 02:22:16 AM

  1. సత్యసాయి నిగమాగమంలోప్రారంభించిన హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ 

హాజరైన నగర సోషలైట్, ఎంటర్‌ప్రిన్యూయర్ శైలజరెడ్డి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): భారతీయ సంస్కృతిలో చేనేతకళలు ప్రధానమైనవని, కళాత్మక నైపుణ్యానికి, నాణ్యమైన పట్టు ఉత్పత్తులకు వేది కగా ఇండియన్ సిల్క్ గ్యాలరీ నిలుస్తుందని తెలంగాణా హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామ య్యార్ అన్నారు. మంగళవారం శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరిట ఏర్పాటు చేసిన సిల్క్ ఎగ్జిబిషన్‌ను ఆమె నగర సోషలైట్, ఎంటర్‌ప్రిన్యూయర్ శైలజరెడ్డితో కలిసి ప్రారంభించారు.

చేనేతకళాకారుల ఉత్పత్తులను తిలకించి వారిని అభినందించారు. తెలంగాణా చేనేతకారులకు పొదుపు, భీమాతో పాటు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో వారి ఉత్పత్తులకు మార్కెటింగ్‌ను చేస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. ఇండియన్ సిల్క్ గ్యాలరీలో నాణ్య మైన పట్టు, కాటన్ వస్త్రాలు లభిస్తాయని, దేశంలోని అన్నిప్రాంతాల చేనేతకా రులకు ఒకచోట చేర్చి వారి ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందింస్తున్న నిర్వాహకులు శ్రీనివాసరావు, వినయ్‌కుమార్ ప్రసం శించారు.

మినిస్ట్రీ ఆఫ్ టెక్స్ టైల్స్ సహకారంతో చేనేతకారుల ఉత్పత్తులను, దేశంలోని ప్రముఖ నగరాలకు చెం దిన చేనేత కళాకారులు వారి ఉత్పత్తులను సుమారు 80స్టాల్స్‌లో ఏర్పాటు చేశామని సిల్క్ ఇండియా సీఈఓ వినయ్ కుమర్ తెలిపారు.

రానున్న దసరా, దీపావళి శుభకార్యాలకు అనువుగా పోచంపల్లి, మదనపల్లి, గద్వాల, వెంకటగిరి, చెందేరి, ఇక్కత్, నానాయణపేట్, బెనారస్, కొలకతాతో పాటు పలు నగరాలకు చెందిన విభిన్నమైన, అరుదైన చీరలను స్టాల్స్ ఏర్పాటుచేశామని, ఈ నెల 23 వరకూ ఈ ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఇంద్ర గుమ్మళ్ల పాల్గొన్నారు.