calender_icon.png 17 September, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అండర్ గ్రౌండ్ కేబులింగ్‌పై అధ్యయనం చేయండి

17-09-2025 01:46:25 AM

అవసరమైన చోట సబ్‌స్టేషన్లు నిర్మించండి 

సీఎం రేవంత్‌రెడ్డి

విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): కోర్ అర్బన్ రీజియన్‌లో ఎక్కడె క్కడ విద్యుత్ సబ్‌స్టేషన్ల అవసరముందో గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సబ్ స్టేషన్లలో అధునాతన సాంకేతికతను ఉపయోగించాలని సూచించారు. విద్యుత్ కేబుళ్లతోపాటు ఇతర కేబుళ్లనూ అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను ఉపయోగించుకోవాలని, అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టులపై అధ్యయనం చేయాలని సూచించారు.

జూబ్లీహి ల్స్‌లోని తన నివాసంలో మంగళవారం రాత్రి విద్యుత్తుశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మా ట్లాడారు. డిసెంబర్‌లోపు ఈ ప్రాజెక్టు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. విద్యుత్తు శాఖ అధికారులు తర్వాత జీహెచ్‌ఎంసీలో అండర్ గ్రౌండ్ కేబులింగ్ విధా నంపై సిద్ధం చేసిన ప్రతిపాదనలను సీఎంకు వివరించారు. రాష్ట్రంలో మూడో డిస్కం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

విద్యుత్తు అవసరాలు పెరుగుతున్నాయని, డిమాండ్‌కు అనుగుణంగా డిస్కం ఉండాలని ఆకాంక్షించారు. దీని పరిధిలోకి వ్యవసాయం, మేజర్, మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్, గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్), జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంచినీటి సరఫరా తీసుకురావాలని సూ చించారు. పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేస్తే, క్యాబినెట్ ఆమోదం తీసుకుని ముం దుకు వెళ్తామని పేర్కొన్నారు.

అండర్ గ్రౌండ్ కేబులింగ్‌తోపాటు కోర్ అర్బన్ రీజియన్‌లో విద్యుత్తు సబ్‌స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాలని సూచించారు. ఓవర్‌లోడ్ సమస్య తలెత్తకుండా లోడ్ రీప్లేస్‌మెంట్ చర్యలు చేపట్టాల ని, సబ్ స్టేషన్ సామర్థ్యం కంటే ఒక్క కనెక్షన్ కూడా ఎక్కువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన చోట సబ్‌స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచాలన్నారు. 

సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్‌మిట్టల్, సీఎం స్పెష ల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి, జెన్‌కో సీఎండీ హరీ శ్, సింగరేణి సీఎండీ ఎన్.బలరాం, రెండు డిస్కంల సీఎండీలు ముషారఫ్, వరుణ్‌రెడ్డి, రెడ్కో చైర్మన్ శరత్ పాల్గొన్నారు.