calender_icon.png 19 December, 2025 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ.. సబ్‌కా బక్వాస్

18-12-2025 12:00:00 AM

  1. కాంగ్రెస్, బీజేపీ.. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ..
  2. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్, బీజేపీ 
  3. బీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ సర్పంచ్ 
  4. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు 

సిద్దిపేట, డిసెంబర్ 17 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ , సబ్కా వికాస్ అంటూ సబ్కా బక్వాస్ చేసిందని మా జీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం నాంచ రు పల్లి గ్రామ సర్పంచ్ పురమండ్ల నరసింహారెడ్డి (సిద్దిపేట అర్బన్ మండలం బిజెపి పార్టీ మాజీ అధ్యక్షులు) బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేసి హరీష్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.

అదే గ్రామానికి చెందిన వార్డు సభ్యులు సంకటి అజయ్, బబ్బురు చంద్రకళ నరేష్, బీజేవైఎం నాయకులు సందీప్ గౌడ్, బోనాల శ్రీకాంత్, కాం గ్రెస్ పార్టీ నాయకులు ఖాతా మల్లారెడ్డి, కొ మరయ్యలకు హరీష్ రావు కండువా కప్పి బిఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్, బిజెపి పార్టీలు ప్రజలలో విశ్వాసనేత కోల్పోయిందని విమర్శించారు.

ఆ రెం డు పార్టీలు గల్లీలో కుస్తీ పడుతూ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం లో బిజెపి అధికారంలో ఉండడం వల్ల నార్త్ ఇండియాలో పండించే గోధుమలకు ఇచ్చే ధర తెలంగాణ రాష్ట్రంలో పండించే వరి ధా న్యానికి ఇవ్వడం లేదని దాంతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. బిఆర్‌ఎస్ అధికారం లో ఉంటే కేంద్రం మెడలు  వంచి రైతులకు మేలు చేకూర్చేదని చెప్పారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక భూముల ధరలు పడిపోయాయని, మహిళలకు 55వేలు, వృ ద్ధులకు 44వేలు రాష్ట్ర ప్రభుత్వం రుణపడి ఉందని విమర్శించారు. సిద్దిపేట జిల్లాలో పంచాయితీ ఎన్నికలలో  ఓటర్లు బిఆర్‌ఎస్ పార్టీకి పట్టం కట్టారని, ఓటర్లందరికి కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో గెలిచిన సర్పంచులు హరీష్ రావును కలిశారు. దాంతో గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.