07-10-2025 12:01:35 AM
హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ నెల 10 నుంచి 12 వరకు
హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో ప్రజాదరణ పొందిన ‘నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో’ నిర్వహిస్తున్నట్టు నరెడ్కో తెలంగాణ ప్రకటించింది. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనుందని సోమవారం ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శన వేళలు ఉంటాయని పేర్కొంది. వివిధ రకాల కస్టమర్ల అవసరాలను తీర్చడానికి, నివాస, కార్యాలయ వాణిజ్యం, రిటైల్ వాణిజ్యంతో సహా ఆస్తులను ప్రదర్శిస్తుంది.
2025లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రగతిశీల విధానాలు, స్థిరమైన సంస్కరణల కారణంగా నగరం ఐటీ, ఐటీఈఎస్, ఫార్మా, ఏరోస్పేస్, ఏవీయేషన్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆర్టిఫిఇయల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో స్థిరమైన జోరు చూస్తోంది. ఈ 15వ నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోకు వివిధ కంపెనీలు, సంస్థలు స్పాన్సర్లుగా ఉన్నాయి. వాటిలో పవర్డ్ స్పాన్సర్స్ వాసవి గ్రూప్, రాంకీ , ప్లాటి నం స్పాన్సర్ అన్విత గ్రూప్, డైమండ్ స్పాన్సర్స్ ఏఎస్‌బీఎల్, గోల్డ్ స్పాన్సర్లు వెర్టెక్స్ హోమ్స్, రాధే గ్రూప్, రాజపుష్ప ప్రాపర్టీస్, సిల్వర్ స్పాన్పర్లు ఆపర్ణ గ్రూప్, సుపద గ్రూప్, గ్రీన్ రిచ్ ఎస్టేట్స్ , బ్రాంజ్ స్పాన్సర్లు అర్భన్‌రైజ్ లైఫ్‌స్టుల్, ఆదిత్య కన్‌స్ట్రక్షన్ కంపెనీ, ఈఐపీఎల్, మనుహార్ హోమ్స్, టోల్‌ప్లాజా స్పా న్సర్లు వజ్రా ఇన్‌ఫ్రా ప్రాజెక్టు, నిఖిల కన్స్రక్షన్, డెవలపర్స్ పాల్గొననున్నాయి.