07-10-2025 02:06:08 PM
హైదరాబాద్: ఓ ఇంటర్ విద్యార్థినిని యువకుడు దారుణంగా హత్య చేసి సంఘటన నల్గొండ జిల్లాలో మంగళవారం చోటు చేసకుంది. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విద్యార్థిని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తక్షణమే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవ పరిక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ దారుణ హత్య చేసిన యువకుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియరాలేదు.