07-10-2025 01:43:45 PM
హైదరాబాద్: హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడకు చెందిన 36 ఏళ్ల వ్యక్తి సెప్టెంబర్ 30న తెలియని వెబ్‌సైట్ ద్వారా చాలా తక్కువ ధరలకు వస్తువులను ఆర్డర్ చేసి ఆన్‌లైన్ మోసానికి గురయ్యాడు. ఆన్‌లైన్ కిరాణా, ఫుడ్ డెలివరీ యాప్ కస్టమర్ కేర్ నుండి వస్తున్నామని అతనికి కాల్ వచ్చింది. అతను పెండింగ్‌లో ఉన్న చెల్లింపును క్లియర్ చేయమని అడిగాడు. ఆ కాల్ చేసిన వ్యక్తి వాట్సాప్ ద్వారా ఎపీకే(APK) ఫైల్‌ను పంపించడంతో దానిని బాధితుడు ఇన్‌స్టాల్ చేసి రూ.360 చెల్లించాడు.
వెంటనే, అతని క్రెడిట్ కార్డు నుండి పెద్ద మొత్తంలో అనధికార డెబిట్ అయిన్నట్లు మెసేజ్ వచ్చింది. బాధితుడినికి ఫోన్ కి ఓటీపీ వచ్చిందని అది చెప్పమని అడిగారాని, అతను ఏ ఓటీపీని షేర్ చేయకపోతే, ఆ మొత్తాన్ని ఇంకా తగ్గించారు. బాధితుడికి తెలియకుండానే అతని ఫోన్‌లో కాల్ ఫార్వార్డింగ్ యాక్టివేట్ చేయబడిందని తరువాత కనుగొన్నాడు. అంతేకాకుండా బాధితుడు ఈ మోసంలో రూ.1.97 లక్షలు కోల్పోయినట్లు సమాచారం. ఆన్‌లైన్ మోసాల బారిన పడవద్దని పోలీసులు ప్రజలను కోరారు. తెలియని వెబ్‌సైట్‌ల నుండి లేదా సందేశాలు, పాప్-అప్‌లు లేదా సోషల్ మీడియా నోటిఫికేషన్‌ల ద్వారా వచ్చే లింక్‌ల నుండి వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండండి. ఏదైనా చెల్లింపు చేసే ముందు ఎల్లప్పుడూ ప్రసిద్ధ కంపెనీల కిరాణా, ఆహార డెలివరీ యాప్‌ల అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ల ద్వారానే చేయాలని సూచించారు.
వాట్సాప్ లేదా ఏదైనా అనధికారిక వనరుల ద్వారా పంపబడిన ఏపీకే ఫైల్‌లను ఎప్పుడూ డౌన్‌లోడ్, లేదా ఇన్‌స్టాల్ చేయవద్దన్నారు. వాటిలో మాల్వేర్, స్పైవేర్ ఉండవచ్చు. ఓటీపీలు, బ్యాంకింగ్ ఆధారాలను పంచుకోవద్దు లేదా మీ ఫోన్‌కు రిమోట్ యాక్సెస్‌ను అనుమతించవద్దని పోలీసులు పేర్కొన్నారు. అనధికార లావాదేవీల కోసం బ్యాంక్, క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, అనుమానాస్పద సందేశాలు, కాల్‌లు లేదా వెబ్‌సైట్‌లను వెంటనే బ్యాంకు, స్థానిక సైబర్ క్రైమ్ అధికారులకు తెలియజేయాన్నారు. చట్టపరమైన చర్యల బెదిరింపులను లేదా తెలియని మూలాల నుండి వచ్చే మనీలాండరింగ్ వాదనలను విస్మరించండి. అటువంటి మోసాలను వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా www.cybercrime.gov.in కు పంపించాలని, సైబర్ మోసాలకు సంబంధించిన ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే దయచేసి 8712665171 కు కాల్, వాట్సాప్ చేయాలని పోలీసులు వెల్లడించారు.