calender_icon.png 24 December, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవి డిమాండ్స్‌పై ఇప్పుడే దృష్టి

24-12-2025 12:52:57 AM

  1. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు
  2. జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ ఆదేశం

హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 23 (విజయక్రాంతి): రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరా, ట్యాంకర్ల నిర్వహణపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మంగళవారం జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్ ఓఅండ్‌ఎం డివిజన్-17 పరిధిలో విస్తృతంగా పర్యటించారు. మియాపూర్ సెక్షన్ పరిధిలోని మయూరి నగర్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న ట్యాంకర్ల డిమాండ్‌తోపాటు, రాబోయే వేసవిలో పెరిగే డిమాండ్‌ను అంచనా వేసి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్’ అమలు, ట్యాంకర్ల నిర్వహణపై అధికారులతో చర్చించి పలు కీలక సూచనలు చేశారు. ట్యాంకర్ ఫిల్లింగ్ పాయింట్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులతో పాటు, మెట్రో కస్టమర్ కేర్ ద్వారా నమోదయ్యే సమస్యలను ఎప్పటికప్పు డు పరిష్కరించాలని ఈడీ స్పష్టం చేశారు. అనంతరం మియాపూర్‌లోని నాగార్జున ఎన్‌క్ల్లేవ్ ప్రాంగణాన్ని ఈడీ సందర్శించారు. ఈ పర్యటనలో జలమండలి సీజీఎంలు కిరణ్ కుమార్, శ్రీనివాసరెడ్డి, డివిజన్ అధికారులు పాల్గొన్నారు.