02-05-2025 01:47:47 AM
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ ఫలితాలను యువత అందిపుచ్చుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు గురువారం మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. భూభారతి, ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుతో పాటు యూనివర్సిటీల్లోని విద్యా ర్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.
వర్గీకరణపై సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. వర్గీకరణపై సామాన్యులకు అర్థమయ్యే విధంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నట్టు చెప్పారు.
యూనివర్సిటీల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులందరూ ఉద్యోగాలు సాధించేందుకు సన్నద్ధం కావాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఓయూ ప్రొఫెసర్ జీ మల్లేశం, పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, వివిధ యూని వర్సి టీలకు చెందిన విద్యార్థి నాయకులు నిఖిత, వేల్పుల సంజయ్, చంద్రశేఖర్, అజయ్, శరత్ నాయక్, కే రాజు, ప్రణతి ఉన్నారు.