02-05-2025 01:49:50 AM
కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌కి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ సవాల్
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనను తప్పులతడకగా ఆరోపించడం కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ దిగజా రుడుతనానికి నిదర్శనమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి ఈ ఇద్దరు కేంద్రమంత్రులే ప్రధాన అడ్డంకిగా మారారని ఆయన మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌తో దోస్తీ కట్టి, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం అక్కసు వెల్లగక్కడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిం దని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు.
బీసీ బిల్లు చట్టబద్ధతపై ప్రధాని మోదీ కి లేఖ రాసే దమ్ముందా? అని ఆయన నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే, కేంద్రమంత్రులమనే విషయం మరిచి మాట్లా డటం వారి అహంకారానికి పరాకాష్ఠ అని మహేశ్‌గౌడ్ దుయ్యబట్టారు.
కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంకల్పం సిద్ధించిందని, ఆయన ఆలోచన మేరకే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల బృందం కులగణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిం దని స్పష్టం చేశా రు. అసెంబ్లీలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల సాక్షిగా ఏకగ్రీ వ తీర్మానంతో కులగణనకు చట్టబద్ధత కల్పించామన్నారు.
గాంధీభవన్‌లో సంబురాలు..
కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకే దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, ఫిషర్‌మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ పేర్కొన్నారు. జనగణనలో కులగణన చేయాలనే నిర్ణయం కాంగ్రెస్ విజయమం టూ గాంధీభవన్ ఆవరణలో సంబురాలు నిర్వహించుకున్నారు.