02-05-2025 01:45:09 AM
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): దేశంలో జనగణనలో కులగణన చేయాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం హర్షణీయమేనని, కానీ క్రెడిట్ మాత్రం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీదేనని పీసీసీ వర్కిం గ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. కులగణన విషయంలో దేశంలో రాహుల్‌గాంధీ, రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి హీరోలుగా నిలిచారని తెలిపారు.
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో పీసీసీ అధికార ప్రతినిధి లింగంయాదవ్‌తో కలిసి గురువారం ఆయన మీడి యాతో మాట్లాడారు. కులగణన విషయం లో రాహుల్‌గాంధీ సూచనలు పాటించిన రేవంత్‌రెడ్డి, జాక్‌పాట్ కొట్టారని ప్ర శంసిచారు.
రాహుల్‌గాంధీ ముందు చూపు ఉన్న నాయకుడని కొనియాడా రు. జోడోయాత్రలో దేశ ప్రజల సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు వేశారని, కులగణన చేయాలని రాహుల్ పదేపదే చెప్పా రని, మోదీ చేయకపోతే రాహుల్‌గాంధీ ప్ర ధానికాగానే ఆయనే చేసేవాడన్నారు.
రాష్ట్ర కులగణన లెక్కలోకి రానివారు.. కేంద్ర కులగణనలోకి లెక్కకు వస్తారన్నారు. రాహుల్‌కి క్రెడి ట్ వస్తుందని, బీజేపీ వాళ్లకు మింగుడుపడటం లేదని ఆరోపించారు. బీజేపీ వాళ్ల లాగా పదవుల కోసం ఎదురుచూసే రకం రాహుల్‌ది కాదన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇప్పుడేమన్నా లాభం లేదన్నారు.