calender_icon.png 29 July, 2025 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర భవిష్యత్తు కూటమితోనే సాధ్యం

29-07-2025 12:00:00 AM

జనసేన గుంటూరు 44వ డివిజన్ అధ్యక్షుడు పవన్ వెంకీ 

గుంటూరు, జూలై 28 (విజయక్రాంతి): కూటమి ప్రభుత్వ పాలనలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు సాధ్యమని గుంటూరు 44వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ వెంకీ తెలిపారు. సోమవారం తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటూ అధికారం కోసం అనధికార ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

గత ఐదు సంవత్సరాల్లో అక్రమంగా సంపాదించిన సొమ్ముతో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని జనం మధ్యలో కాకుండా ఇళ్లలో పెట్టుకొని విందులు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మొత్తంగా వైసిపిని జనం నమ్మే పరిస్థితి లేదని ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులు గ్రహించాలని ఈ సందర్భంగా హతువు పలికారు.