calender_icon.png 13 September, 2024 | 1:23 AM

నల్లగొండ సమగ్రాభివృద్ధే లక్ష్యం

02-07-2024 05:49:40 AM

  • ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 
  • జిల్లా కేంద్రంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన

నల్లగొండ, జూలై 1 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు. జిల్లా కేంద్రంలోని బీట్ మార్కెట్ సమీపంలో రూ.3 కోట్లతో చేపట్టనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు సోమవారం మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. సబ్ స్టేషన్ నిర్మా ణం పూర్తయితే  వేసవిలో15 వేల ఇండ్లకు లోవోల్టేజీ సమస్య తీరుతుందని చెప్పా రు. రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని విద్యుత్తుశాఖ ఇంజినీర్లు, కాంట్రాక్టర్ల ను ఆదేశించారు. నల్లగొండ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా)లో నూతనం గా కలిసిన గ్రామాలకు సాగునీరు అందించేందుకు రూ.200 కోట్లు కేటాయించామని, రూ.90 కోట్లతో నీలగిరి సాంస్కృ తిక నిలయాన్ని నిర్మించనున్నామని వెల్లడించారు.

నల్లగొండలో టీ హబ్‌తోపాటు కలెక్టరేట్ వద్ద మరో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ను నిర్మిస్తున్నామని చెప్పారు. పట్టణంలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు రూ.30 కోట్లు, అదేవిధం గా రూ.700 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. ఎస్‌ఎల్బీసీ సమీపంలో అన్ని వస తులతో మల్టీపర్పస్ హాస్టల్ నిర్మించబోతున్నామని పేర్కొన్నారు. ఎస్‌ఎల్బీసీ సొరంగమార్గం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. అనంతరం పట్టణ పరిధిలోని మామిళ్లగూడెం లో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో  మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మున్సిపల్  చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్‌గౌడ్, జడ్పీటీసీ లక్ష్మయ్య పాల్గొన్నారు.