28-12-2025 11:05:50 AM
ఆలయ ఈఓ రమాదేవి
వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు అనుబంధమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సమ్మక్క–సారలమ్మ జాతర నేపథ్యంలో భక్తుల రాక పెరిగే అవకాశముందని ఆలయ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఈ క్రమంలో 28-12-2025, 04-01-2026, 11-01-2026, 18-01-2026 (ఆదివారాలు) తేదీల్లో ఆలయాన్ని 24 గంటలు తెరిచి ఉంచి నిరంతర దర్శనాలు కల్పించనున్నట్లు ఆలయ ఈఓ ఎల్. రమాదేవి తెలిపారు.భక్తుల సౌకర్యార్థం దర్శనాలు, పూజా కార్యక్రమాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొంటూ, సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఈఓ రమాదేవి విజ్ఞప్తి చేశారు.