calender_icon.png 28 December, 2025 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. జలాల సమస్యలే అజెండా

28-12-2025 12:02:30 PM

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ప్రసుత్తం నదీ జలాల సమస్యలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతున్న నేపథ్యంలో శాసనసభ సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి.  బీఆర్ఎస్ ఇటీవల తెలంగాణ జల హక్కులను పరిరక్షించడానికి ఆందోళనను ప్రకటించింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీకి అసెంబ్లీలో చర్చకు సవాలు విసరడంతో నీటి సమస్యలు ఈ శీతాకాల సమావేశం అజెండాలో ప్రధాన అంశాలుగా ఉండే అవకాశం ఉంది.

గత రెండేళ్లుగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఇటీవల తెలంగాణ భవన్లో ప్రారంభమైన బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం ఆయన హాజరయ్యారు. సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ... పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపినప్పటికీ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమైందన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కాంగ్రెస్ పాలనను పనికిమాలినదని అభివర్ణించారు.