calender_icon.png 28 December, 2025 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆవు మృతి.. రైతుకు తీరని నష్టం

28-12-2025 11:08:26 AM

ప్రభుత్వం ఆదుకోవాలి : సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్

సిద్దిపేట రూరల్: నారాయణరావుపేట మండల పరిధిలోని గుర్రాలగొంది గ్రామానికి చెందిన యువ రైతు పిట్ల శేఖర్‌కు చెందిన లక్ష రూపాయల విలువైన ఆవు ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటనతో రైతు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నాడని గ్రామ సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్ తెలిపారు. బాధిత రైతును ప్రభుత్వం వెంటనే ఆదుకొని తగిన పరిహారం అందించాలని కోరారు. సంబంధిత అధికారులు స్పందించి రైతుకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.