28-12-2025 11:48:02 AM
హైదరాబాద్: అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ ప్రదేశ్ గాంధీ భవన్ లో ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎమ్మెల్సీ వెంకట్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహాత్మా గాంధీ గారి విగ్రహానికి, జవహర్ లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు.