పట్టణంలోని ప్రతి వార్డు అభివృద్ధే లక్ష్యం
మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది
సూర్యాపేట, ఆగస్టు 20 (విజయక్రాంతి) : సూర్యాపేట పట్టణంలోని ప్రతి వార్డు అభివృద్ధి లక్ష్యమని అందులో భాగంగానే ప్రతి వార్డుకి ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. గురువారం 38వ వార్డులోనీ సత్రం బజార్ లో ఐదు లక్షల రూపాయల వ్యయంతో డ్రైన్ ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ మాజి చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిల సహకారంతో నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
ఈ కార్య క్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ వు ల్లా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షు లు వెలుగు వెంకన్న, వార్డు కౌన్సిలర్ గం డూరి రమేష్, నాగుల వాసు, బండారు వెంకన్న, ఫారుక్ , మహమ్మద్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.






