13-01-2026 12:00:00 AM
మొయినాబాద్ మండల సర్పంచ్ సంఘం నూతన అధ్యక్షుడు చింతకింది ప్రవీణ్ రెడ్డి
మొయినాబాద్, జనవరి 12 (విజయ క్రాంతి): మొయినాబాద్ మండలంలోని 19 గ్రామ పంచాయతీలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేయాలని మొయినాబాద్ మండల సర్పంచ్ల సంఘం నూతన అధ్యక్షుడు చింతకింది ప్రవీణ్ రెడ్డి పిలుపు నిచ్చారు. సోమవారం మొయినాబాద్ మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు ఏక గ్రీవంగా చింతకింది ప్రవీణ్ రెడ్డిని మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షు డిగా ఎన్నికైన ప్రవీణ్ రెడ్డిని సర్పంచ్లు సన్మానించారు.
అనంతరం ప్రవీణ్‌రెడ్డి మాట్లా డుతూ, పార్టీలకు అతీతంగా సర్పంచ్లందరూ కలిసి గ్రామాల అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని అన్నారు. తాను ఎత్మార్పల్లి గ్రామ సర్పంచ్గా గెలుపొందడమే కాకుండా మొయినాబాద్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మండలంలోని సర్పంచ్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షులుగా బాకారం వెంకటేష్ గౌడ్, కోశాధికారిగా కుత్బుద్దీనూడా పాషా, కార్యదర్శులుగా అమ్లాపూర్ మధ్యసాగ కృష్ణ, కాశింబౌలి రాజేందర్ రెడ్డిలను ఎన్నుకున్నారు. సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.