calender_icon.png 13 January, 2026 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ భద్రత, డేటా ప్రైవసీ క్వాంటమ్-సేఫ్‌పై అవగాహన

13-01-2026 12:00:00 AM

ఘట్ కేసర్, జనవరి 12 (విజయక్రాంతి) : వెంకటాపూర్‌లోని అనురాగ్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో సైబర్ సేఫ్ 2.0 ఏఐ ఆధారిత సైబర్ భద్రత, డేటా ప్రైవసీ మరియు క్వాంటమ్-సేఫ్ అవగాహన కార్యక్రమం అనే ఐదు రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అనురాగ్ యూనివర్సిటీ డీన్ (అకాడమిక్స్ అండ్ ప్లానింగ్) ప్రొఫెసర్ సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే డాక్టర్ డి. కృష్ణ, రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ అండ్ హెడ్, కంప్యూటర్ సెంటర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నితీషా శర్మ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాధిపతి శేఖర్ రెడ్డి, ఎంసిఎ  ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వేదికను అలంకరించారు.

ఈ కార్యక్రమాన్ని డాక్టర్  లక్ష్మీ ప్రసన్న బైరపునేని, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐటీ విభాగం, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా సమన్వయం చేశారు. ఈఐదు రోజుల కార్యక్రమంలో విద్యార్థులకు ఏఐ ఆధారిత సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ చట్టాలు, ఎథికల్ హ్యాకింగ్, డీప్ఫేక్ గుర్తింపు, సురక్షిత ఆథెంటికేషన్ క్వాంటమ్-సేఫ్ క్రిప్టోగ్రఫీ వంటి సమకాలీన అంశాలపై నిపుణులచే ఉపన్యాసాలు  హ్యాండ్స్-ఆన్ శిక్షణ అందించబడింది. మొత్తం 110 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 80 మందికి పైగా విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ అందించారు.