calender_icon.png 26 August, 2025 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల ఆర్థిక బలోపేతమే లక్ష్యం

27-11-2024 04:33:54 AM

మహబూబాబాద్  ఎమ్మెల్యే మురళీనాయక్ 

మహబూబాబాద్, నవంబర్ 26: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభిస్తున్నదని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో మహిళా శక్తి క్యాంటీన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామికంగా ఎదిగేందుకు మహిళా క్యాంటిన్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.