23 June, 2026 | 1:34 AM

‘ప్రీ ప్రైమరీ’ని ఐసీడీఎస్‌కు అప్పగించాలి

23-06-2026 12:00 AM

నోటిఫికేషన్ రద్దు చేయాలి: సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రఘుపతిరావు

నూగూరు వెంకటాపురం,జూన్ 22 (విజయక్రాంతి): ప్రీ ప్రైమరి స్కూల్ నిర్వహణ  బాధ్యతలను ఐసీడీఎస్ కు అప్పగించాలని, నోటిఫికేషన్ ను రద్దు చేయాలనీ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆందోళన చేశారు.

అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కొప్పుల రఘుపతిరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఐసీడీఎస్ స్కిం లో గత 50 సంవత్సరాల నుండి అంగన్వాడీ టీచర్స్ అనేక రకాల సేవలు, పోస్టికాఆహారం అందించటంతో పాటు ప్రాథమిక విద్య అందించటం లాంటి అనేక కార్యక్రమాలు అంగన్వాడీ సిబ్బంది, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.

0 నుండి 5 సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ సెంటర్ లోనే విద్యను అందించాలని  ఉన్నప్పటికీ, 3 నుండి 5 సంవత్సరాల విద్యార్థుల ను ప్రీ ప్రైమరి కొత్త సెంటర్ ఏర్పాటు చేసి అంగన్వాడీ పిల్లల ను బలవంతం గా తీసుకు వెళ్ళాలని చూస్తున్నారని ఇది సరైంది కాదని వారు  అన్నారు.ఇప్పటికే ప్రీ ప్రైమరి సమస్య పై అనేక ఆందోళన చేస్తున్నప్పటికి ప్రభుత్వం స్పందించటం లేకపోవడం వల్లే సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా వ్యాపితంగా మండల విద్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించటం జరుగుతుందని అయినా స్పందించక పొతే డీఈవో కార్యాలయం ఎదుట కూడా ధర్నా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఎన్వీరమణ, సడాలు,రత్నకుమారి,విజయ లక్ష్మి,హంసరెక, బేబీ,వసుందర, రామకృష్ణ,బిక్షవతి,స్వరూప, సీతారత్నం తదితరులు పాల్గొన్నారు