25 March, 2026 | 3:04 AM

రైతును రాజును చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం

25-03-2026 01:27 AM

* కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జయరాం రెడ్డి 

మంగపేట, మార్చి 24 (విజయక్రాంతి): రైతును రాజును చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి అన్నారు. రైతులకు రైతు భరోసా నిధులు  విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద మంగళవారం సీయం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీయం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క , తుమ్మల నాగేశ్వరరావు చిత్ర పటాలకు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మైల జయరాం రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రైతన్న పక్షపాతి అని, దేశానికి వెన్నముక రైతన్న అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రైతన్నను రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. గత పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ పార్టీ రైతన్నకు చేసింది ఏమీ లేదని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో మంగపేట రైతు సేవా సహకార సంఘం మాజీ అధ్యక్షుడు తోట రమేష్, నాయకులు పూజారి సురేందర్ బాబు, టీవీ.హిదయతుల్లా, అయ్యోరి యానయ్య, చాద మల్లయ్య , చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, ముత్తినేని ఆదినారాయణ, గంగినేని శేషగిరి, కొమరగిరి కేశవరావు, మండవ రామకృష్ణ, ఎడ్ల నరేష్, భగవాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.