25 March, 2026 | 3:04 AM

హెల్మెట్ ఉంటేనే గ్రామంలోకి అనుమతి

25-03-2026 01:28 AM

నరసింహుల గూడెం గ్రామస్తుల తీర్మానం

మహబూబాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): మా గ్రామంలోకి ద్విచక్ర వాహనంపై వచ్చేవారు కచ్చితంగా హెల్మెట్ ధరించి రావాలని, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై గ్రామంలోకి రావడానికి అనుమతించమని, అలాగే తమ గ్రామంలో ప్రతి ద్విచక్ర వాహన దారుడు హెల్మెట్ ధరిస్తామని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నరసింహుల గూడెం సర్పంచ్ జ్యోతి ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు మంగళవారం తీర్మానం చేశారు. అలాగే గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామని, గంజాయి ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు పగడ్బందీగా చర్యలు తీసుకుంటామని, అలాంటి సంఘటనలు దృష్టికి వస్తే పోలీసులకు సమాచారం ఇస్తామని తీర్మానం చేసి ఎస్ ఐ చిర్ర రమేష్ బాబు కు అందజేశారు.