calender_icon.png 15 May, 2025 | 10:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కారు భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు

15-05-2025 12:00:00 AM

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్ మే 14 (విజయక్రాంతి): జిల్లాలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇటీవల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సర్కారు భూములు ఆక్రమణకు గురవుతున్న విషయాలు గుర్తించామని, వాటిని రెవెన్యూ అధికారులు వెంటనే స్వాధీ నం చేసుకున్నారని తెలిపారు.

ఈ నేపథ్యం లో రెవెన్యూ అధికారులకు సర్కారు భూములపై ఎటువంటి ఆక్రమణను అయినా కఠి నంగా అణచివేయాలని సూచించడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటికే పలు మండలాల్లో రెవెన్యూ శాఖ సర్వేలు చేపట్టి, చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రభు త్వ భూముల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని, ఇకపై అక్రమాలకు పాల్పడిన వారి పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.